నిర్మాణ రంగ సంస్థల్లో ఉత్సాహం

హైదరాబాద్‌ : జాతీయ రహదారి అభివృద్ధి పనులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో భారత నిర్మాణ రంగ సంస్థల్లో ఉత్సాహం పెరిగిందని బీసీ ఎక్స్‌పో సీఈఓ థామస్‌ లోప్లర్‌ అన్నారు. 2012 నాటికి 4 వేల 375 కిలోమీటర్ల మేర ఏడులైన్ల జాతీయ రహదారి విస్తరణ పనులకు కేంద్రం సుముఖంగా ఉందని, దీని ఫలితంగా 3 లక్షల కోట్ల రూపాయల నిర్మాణ రంగానికి లభించాయన్నారు. ఈ అవకాశాల్ని పరిశ్రమలు అందిపుచ్చుకునేలా అవగాహన కల్పించేందుకు ముంబయిలో ప్రదర్శన నిర్వహించనున్నట్లు థామస్‌ తెలిపారు. 2013 ఫిబ్రవరి 5 నుంచి 8వ తేదీ వరకు జరిగే ప్రదర్శనలో 600కి పైగా దేశీయ, అంతర్జాతీయ నిర్మాణ పరిశ్రమలు పాల్గొంటాయని వెల్లడించారు.