నూతన గ్రామపంచాయతీ భవనం ప్రారంభం

వేములవాడ గ్రామీణం, సెప్టెంబర్ 25 (జనంసాక్షి): వేములవాడ గ్రామీణ మండలం లింగంపల్లి లో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని సోమవారం గ్రామీణ జడ్పీటీసీ యేశ వాణి తిరుపతి, ఎంపీపీ బండ మల్లేశం ప్రారంభించారు.ఈ సందర్భంగా నాయకులను సర్పంచ్ సామ కవిత తిరుపతిరెడ్డి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పుల్లూరి ప్రేమల రమేష్, కార్యదర్శి ప్రేమ్ చంద్,వ్యవసాయ శాఖ ఏఈవో సందీప్,ఎంపిటిసి మల్లారం తిరుపతి,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెలుమ బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు