నూతన పంచాయతీరాజ్ చట్టంతో.. పల్లెల రూపురేఖలు మారుతాయి

– కేసీఆర్ నమ్మకాన్ని నిలబెడతా
– 35ఏళ్ల రాజకీయ జీవితంలో 25ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేశా
– నన్ను చాలా మంది మోసం చేశారు
– చంద్రబాబు కూడా మంత్రి పదవి ఇవ్వలేక పోయాడు
– పంచాయతీరాజ్, గ్రావిూణాభివృద్ధిశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఎర్రబెల్లి
హైదరాబాద్, ఫిబ్రవరి22(జనంసాక్షి) : రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నూతన పంచాయతీరాజ్ చట్టంతో పల్లెల రూపురేకలు మారతాయని, పల్లెల్లో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా జీవించేలా కేసీఆర్ సలహాలు, సూచనలతో తాను కృషి చేస్తానని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రావిూణాభివృద్ధిశాఖ మంత్రిగా ఎర్రబెల్లి దయాకర్‌రావు గురువారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు మంత్రి ఎర్రబెల్లికి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం ఎర్రబెల్లి విూడియాతో మాట్లాడారు.. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా గ్రామాలు ఇంకా ఆధ్వాన్వంగా ఉన్నాయన్నారు. సీఎం తీసుకొచ్చిన నూతన పంచాయతీ చట్టంతో గ్రామాల రూపురేఖలు మారతాయని చెప్పారు. సీఎం కేసీఆర్ తనకు పెద్ద బాధ్యతను అప్పగించారన్నారు. తనకు ఇంత పెద్ద బాధ్యతను అప్పగించినందుకు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. రైతులు బాగుపడాలి, పంచాయతీలు అందంగా కనిపించాలన్నారు. గతంలో ఉన్నట్లుగా గ్రావిూణ వ్యవస్థను మళ్లీ బాగుచేయాలని తెలిపారు. నా రాజకీయ జీవితంలో అనేక మంది నన్ను మోసం చేశారని ఎర్రబెల్లి అన్నారు. ఇక తన 35ఏళ్ల రాజకీయ జీవితంలో 25 ఏళ్లు ఎమ్మెల్యేగా చేశానని, మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న సమయంలో పొందిన ఆనందం ఎప్పుడు కలగలేదని తెలిపారు. చాలామంది తనను మోసం చేశారని, ఎన్టీఆర్ తనకు మంత్రి పదవి ఇస్తానంటే కొన్ని శక్తులు అడ్డుపడ్డాయని ఎర్రబెల్లి పేర్కొన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు కూడా తనకు మంత్రి పదవి ఇస్తానని హావిూ ఇచ్చారని, కానీ చివరకు మంత్రి పదవి ఇవ్వకుండా మోసం చేశారని ఆయన అన్నారు. తాను అడగకుండానే కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చారని అన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్‌రావుకు మంత్రి మల్లారెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, రాజయ్య, ఎమ్మెల్యేలు ధర్మారెడ్డి, శంకర్ నాయక్, పెద్ది సుదర్శన్, అరెకపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, మాగంటి గోపీనాథ్, కెచర్ల భూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ రాజేశ్వర్ రెడ్డి, గుండు సుధారాణి తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.


