నెంబర్‌వన్‌గా ఏడాది ముగించిన మెక్ల్‌రాయ్‌ మూడోస్థానంలో టైగర్‌వుడ్స్‌

లండన్‌, డిసెంబర్‌ 17:  ఈ ఏడాదిలో చివరి  వరల్డ్‌ గోల్ఫ్‌ ర్యాంకింగ్స్‌ జాబితాను ప్రకటించారు. నార్త్‌ ఐరిష్‌ గోల్ఫర్‌ రోరీ మెక్‌ల్‌రాయ్‌ అగ్రస్థా నంతో 2012ను ముగించాడు. జాబితాలో మెక్‌ల్‌రాయ్‌ సగటున 13.22 పాయింట్లతో టాప్‌ ప్లేస్‌ కైవసం చేసుకున్నాడు. దీంతో మాజీ నెంబర్‌ వన్‌ ల్యూక్‌ డొనాల్డ్‌ రెండో స్థానంలోనూ, టైగర్‌ వుడ్స్‌ మూడో స్థానంలోనూ నిలి చారు. మెక్‌ల్‌రాయ్‌ నెంబర్‌ వన్‌గా ఏడాది ముగించడం ఇదే తొలిసారి. 23 ఏళ్ళ రోరీ 2012లో నాలుగు మేజర్‌ టోర్నీలలో విజేతగా నిలిచాడు. ఆగష్ట్‌ లో యుఎస్‌పిజిఎ ఛాంపియన్స్‌షిప్‌ గెలుచుకోవడం అతని కెరీర్‌కు మలు పుగా చెప్పొచ్చు. ఇక ఇంగ్లాండ్‌కు చెందిన జస్టిన్‌ రోస్‌ నాలుగు, ఆస్టేల్రియా గోల్ఫర్‌ ఆడమ్‌ స్కాట్‌ ఐదో స్థానంలోనూ నిలిచారు. ఇదిలా ఉంటే భారత గోల్ఫర్లు ఇద్దరు టాప్‌ 100 లో చోటు దక్కించుకున్నారు. గగన్‌జీత్‌ బుల్లర్‌ 89వ ర్యాంకులోనూ, జీవ్‌ మిల్కాసింగ్‌ 96వ ర్యాంకులోనూ ఉన్నారు.

వరల్డ్‌ గోల్ఫ్‌ ర్యాంకింగ్స్‌ – టాప్‌ 10 ః

1. రోరీ మెక్‌ల్‌రాయ్‌ – నార్త్‌ ఐర్లాండ్‌  – 13.22 పాయింట్లు

2. ల్యూక్‌ డొనాల్డ్‌    – ఇంగ్లాండ్‌      – 8.62 పాయింట్లు

3. టైగర్‌వుడ్స్‌       – అమెరికా      – 8.53 పాయింట్లు

4. జస్టిన్‌ రోస్‌        – ఇంగ్లాండ్‌      – 6.42 పాయింట్లు

5. ఆడమ్‌ స్కాట్‌     – ఆస్టేల్రియా   – 6.21 పాయింట్లు

6. లూయీస్‌          – దక్షిణాఫ్రికా   – 6.14 పాయింట్లు

7. లీ వెస్ట్‌వుడ్‌        – ఇంగ్లాండ్‌     – 6.03 పాయింట్లు

8. బుబ్బా వాట్సన్‌   – అమెరికా      – 5.30 పాయింట్లు

9. జాసన్‌ డఫ్నర్‌     – అమెరికా     – 5.29 పాయింట్లు

10. బ్రాండ్ట్‌ స్నీడ్‌కర్‌- అమెరికా     – 5.23 పాయింట్లు