నెక్లెస్‌ రొడ్‌లో 10కె రన్‌

హైదరాబాద్‌ : నెక్లెస్‌ రోడ్‌ 10కె రన్‌ ఈఉదయం  ప్రారంభమైంది. ఈకార్యక్రమానికి కేంద్ర మంత్రి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌. నగర పోలీసు కమిషనర్‌ అనురాగ్‌ శర్మ రన్‌ను ప్రారంభించారు. పుల్లెల గోపీచంద్‌ సానియా మీర్జా తదితరులు రన్‌లో పాల్గొని యువతలో ఉత్సాహాన్ని నింపారు. పరుగు దృష్ట్యా నెక్లెస్‌ రోడ్‌, ట్యాంక్‌ బండ్‌ పరిపర ప్రాంతాల్లో ఈఉదయం 5గంటలకు నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పోలీసులు ట్రాపీక్‌ ఆంక్షలు విధించారు.