నెల్లూరులో మంత్రులను అడ్డుకున్న తెదేపా నేతలు

నెల్లూరు: విద్యుత్‌ సర్‌ఛార్జీల పెంపునకు నిరసనగా నెల్లూరులో తెదేపా ఆందోళనకు దిగింది, నగరంలో పలు కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన మంత్రులు ఆనం పితానిలను పినాకిని అతిథిగృహం వద్ద తెదేపా  కార్యకర్తలు అడ్గుకున్నారు. సర్‌ఛార్జీలు వెంటనే ఉపసంహరించాలని డిమాండ్‌ వ్యక్తం చేశారు. పోలీసులు ఆందోళనకారులను అడ్డుకోవడంతో తోపులాట చోటుచేసుకుంది.