నేటితో ముగియనున్న అంతర్జాతీయ జీవవైవిధ్య సదస్సు

హైదరాబాద్‌: నగర వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక జీవవైవిధ్య సదస్సు నేటితో ముగియనుంది. ఈ నెల 1 నుంచి జరుగుతున్న ఈ సదస్సులో 193 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. జీవ భద్రత, సముద్ర జీవవైవిధ్య పరిరక్షణ, జీవ ఇంధనాలు, నిధుల సమీకరణ తదితర అంశాలపై సభ్య దేశాల మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. రెండేళ్ల తర్వాత తదుపరి సమావేశాన్ని కొరియాలో నిర్వహించనున్నారు.