నేటితో ముగియనున్న డైట్‌సెట్ ఆప్షన్ల గడువు
హైదరాబాద్: డైట్‌సెట్ -2012 వెబ్ ఆప్షన్ల నమోదుకు మంగళవారం సాయంత్రం 5 గంటలతో గడువు ముగియనుంది. మొదట ప్రకటించిన ప్రకారం ఈ నెల 2వ తేదీతో వెబ్‌ఆప్షన్ల నమోదు గడువు ముగిసింది. విద్యార్థుల నుంచి స్పందన తక్కువగా ఉన్నందున ఆప్షన్ల నమోదును నేటి వరకు పొడగించిన విషయం తెలిసిందే.



