నేటి నుంచి అహోబిలం బ్రహ్మోత్సవాలు

ఆళ్లగడ్డ, కర్నూలు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలం శ్రీలక్ష్మీనరసింహ స్వామి బ్రహోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఎగువ అహోబిలంలో అంకరార్పణతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 28 వరకూ ఉత్సవాలు జరగనున్నాయి. ఇందు కోసం ఏర్పాట్లను దేవస్థానం అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. ఆలయ ఆవరణలో, బయట భక్తుల కోసం చలువ పందిళ్ల నిర్మాణం చేపట్టారు.