నేటి నుంచి కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి ఇందిరమ్మబాట

కర్నూలు: సోమవారం జరగాల్సిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి జిల్లా పర్యటన వాతావరణం అనుకూలించకపోవడంతో వాయిదా పడింది. మంగళ, బుధవారం పర్యటన యధావిధిగా జరగనుంది. ఐదో తేదీన కర్నూలు నగరంలో కార్యక్రమాలన్ని ముగించుకుని సాయంత్రం నాలుగు గంటలకు నందికొట్కూరుకు బయలు దేరుతారు. 4.30 అక్కడికి చేరుకుని, అనంతరం ఆత్మకూరుకు వెళ్లి రాత్రి అక్కడే బస చేస్తారు. ఆరో తేదీన కృష్ణాపురం, ఆత్మకూరు, వెలుగోడు, మహానందిలో కార్యక్రమాలు ముగించుకుని మథ్యాహ్నం రెండు గంటలకు మహానంది నుంచి  హెలీక్యాప్టర్‌లో సున్నిపెంట చేరుకుంటారు. సున్నిపెంట, శ్రీశైలంలో కార్యక్రమాలు చూసుకుని సాయంత్రం హెలీక్యాప్టర్‌లో హైదరాబాద్‌కు బయలుదేరుతారు.