నేటి నుంచి పశ్చిమగోదావరి జిల్లాలో సీఎం ఇందిరమ్మ బాట

హైదరాబాద్‌: ఇందిరమ్మబాట కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ రోజు నుంచి మూడురోజుల పాటు పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం రాజధాని నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి పోలవరం ప్రాజెక్టు సందర్మనతో జిల్లాలో ఇందిరమ్మబాట శ్రీకారం చుడతారు. అనంతరం దేవరగొండి లబ్ధిదారులతో సమావేశమవుతారు. తరువాత బుడ్డపగూడెం గిరిజనులతో ముఖాముఖి నిర్వహిస్తారు. కేఆర్‌ పురంలో స్వయం సహాయక బృందాలతో సమావేశమై కుటుంబ కౌన్సిలింగ్‌ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. అనంతరం జిల్లాలో పలు ప్రాంతాల్లో పర్యటిస్తారు, సాయంత్రం కామవరపుకొటలో ఎర్రకాలువను ప్రారంభించి లభ్దిదారులతో మాట్లాడతారు. రాత్రికి పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తారు. అనంతరం పొలసానిపల్లి బాలికల పాఠశాలలో విద్యార్థులతో సహపంక్తి భోజనాలు చేసి వెంకట్రామన్నగూడెంలోని ఉద్యాన విశ్వవిద్యాలయంలో బస చేస్తారు.