నేడు అసెంబ్లీ ముందుకు కార్యాచరణ ప్రణాళిక

హైదరాబాద్‌ : వ్యవసాయ బడ్జెట్‌ వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నేడు వ్యవసాయ కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వం మరోమారు శాసనసభ, మండలిలో ప్రవేశపెట్లనుంది. ఇందుకోసం బడ్జెట్‌ అని ఉన్న చోట కార్యాచరణ ప్రణాళిక అని చేర్చి అధికారులు పుస్తకాలను తిరిగి ముద్రించారు. వ్యవసాయ కార్యాచరణ ప్రణాళికపై నేడు స్పీకర్‌ అసెంబ్లీలో రూలింగ్‌ ఇవ్వనున్నారు.