నేడు ఢిల్లీ పోలీసులకు పోస్టుమార్టమ్ నివేదిక
న్యూఢిల్లీ : సామూహిక అత్యాచారానికి గురై సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన వైద్య విద్యార్థిని పోస్టుమార్టమ్ నివేదిక నేడు ఢిల్లీ పోలీసులకు అందనుంది. సింగపూర్‌లో యువతి చికిత్స పొందిన మౌంట్ ఎలిజబెత్ ఆసుపత్రి నుంచి ఈ నివేదిక అందనున్నట్లు పోలీసులు తెలిపారు. యువతి మృతి అనంతరం మృతదేహాన్ని భారత్‌కు పంపేముందు అక్కడే పోస్ట్‌మార్టమ్ నిర్వహించారు. మరోవౌసే ఈ కేసుకు సంవంధించి గురువారం ఢిల్లీ కోర్టులో దాదాపు వెయ్యి పేజీలతో కూడిన ఛార్జిషీట్‌ను దాఖలు చేయడానికి సిద్ధమవుతున్నట్లు పోలీసులు చెప్పారు. గత నెలలో దక్షిణ ఢిల్లీలోని ఓ బస్సులో దుండగుల చేతిలో సామూహిక అత్యాచారినికి గురై 13 రోజులపాటు మృత్యువుతోపోరాడిన అనంతరం యువతి మృతి చెందిన విషయం తెలిసిందే.