నేడు భారత్-పాక్ విదేశాంగ శాఖ మంత్రుల భేటీ
ఇస్లామాబాద్: భారత్-పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రుల భేటీ నేడు ఇస్లామాబాద్‌లో జరగనుంది. భారత్ విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌ఎం కృష్ణ,పాక్ విదేశాంగ శాఖ మంత్రి హీనారబ్బానీఖర్‌ల మధ్య జరిగే భేటీలో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ జరగనుంది. మరోవైపు భారత్, పాక్ దేశాల మధ్య వీసా నిబంధనల సరళతర అంశంపై ఇరు దేశాలు ఒప్పందం కృష్ణ ఈ ఒప్పందంపై నేడు సంతకం చేయనున్నారు.మూడు రోజుల పర్యటన కోసం ఎస్‌ఎం కృష్ణ నిన్న పాక్ చేరుకున్నారు.



