నేడు ముగియనున్న జ్యోతుల పాదయాత్ర
జగ్గయ్యపేట : ఏలేరు ఆధునీకరణ కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత జ్యోతుల నెహ్రూె ఆధ్వర్యంలో వారం రోజుల నుంచి సాగుతున్న పాదయాత్ర నేడు ముగియనుంది. ఈ సందర్భంగా సాయంత్రం 6 గంటలకు ఉప్పాడ సెంటర్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. గొల్ల బాబూరావు, సుజయ్ కృష్ణరంగారావు, వసంత నాగేశ్వరరావు, తదితరులతో పాటు జిల్లా పార్టీ నేతలు ఈ సభలో పాల్గొంటారు.


