నేడు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం
హైదరాబాద్: రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం ఈ రోజు జరగనుంది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, వివిధ శాఖల మంత్రులు, ప్రభుత్వ సీనియర్ అధికార్లు, బ్యాంకర్లు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. వ్యవసాయ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు, స్వయం సహాయ బృందాలకు ఇచ్చే రుణాలను సమీక్షించడంతోపాటు, వివిధ అంశాలపై కేంద్రం ఇచ్చిన మార్గదర్శికాలపై చర్చించనున్నారు.



