నేడు శివసేన కార్పొరేటర్ల సమావేశం
ముంబయి: శివసేన అధినేత బాల్ ధాకర్ ఆరోగ్య పరిస్థితిపై చర్చించేందుకు ఆ పార్టీ కార్పొరేటర్లు ఈ ఉదయం ముంబయిలో సమావేశమవుతున్నారు. ఉద్ధన్ధాకర్ నేతృత్వంలో ఈ భేటీ జరగనుంది. ధాకరే ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని పార్టీ పత్రిక సామ్నా ద్వారా నేతలు తెలియజేశారు. మరోవైపు ధాకరే ఆర్యోగ పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ముంబయిలో స్తంభించిన జనజీవనం క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటోంది.