నేడు సమావేశం కానున్న వామపక్ష పార్టీలు
హైదరాబాద్: రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభంపై వామపక్ష పార్టీలు గురువారం ఉదయం బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాయి. ఈ సమావేశానికి సీపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు,సీపీఐ కార్యదర్శి నారాయణ లు హాజరుకానున్నారు.


