నేతల ఇళ్లకు తాళం వేయాలని కలెక్టర్‌ ఆదేశం

నల్గొండ: మిర్యాలగూడ ఎన్‌ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఉంటున్న రాజకీయ నేతలను అక్కడి నుంచి ఖాళీ చేయించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. క్యాంపు కార్యాలయంలో ఉంటున్న నేతల ఇళ్లకు తాళం వేయాలని జిల్లా కలెక్టర్‌ స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే రేపాడ శ్రీనివాస్‌ సహా పలువురు నేతలు నివాసుముంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా క్యాంపు కార్యాలయం వద్ద పోలీసులు భారీ భద్రత చేపట్టారు.