నైజీరియాలో ఓ వ్యక్తిని కిడ్నాప్‌ చేసిన దుండగులు: 3.5 కోట్ల డిమాండ్‌

కొట్టాయం: నైజీరియాలోని సాయుధ దుండగులు కేరళకు చెందిన ఓ వ్యక్తిని కడ్నాప్‌ చేశారు. ఈ విషయాన్ని సోమవారమిక్కడ కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు. నైజీరియాలో నిర్మాణ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఈ నెల 13న కార్యాలయానికి వెళ్తున్న సమయంలో దుండగులు ఆయన్ను అవహరించారు. అనంతరం రాజిమన్‌ పనిచేసే రే రయల్‌ నిర్మాణ కంపెనీని సంప్రదించి రూ.7.50 కోట్లు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. తర్వాత ఈ మొత్తాన్ని రూ.5.50 కోట్లకు తగ్గించారు, చివరకు రూ.3.50 కోట్లకు తగ్గించారు.