నైజీరియాలో విమాన ప్రమాదం : ఐదుగురికి గాయాలు
అబుజా: ఉత్తర నైజీరియాలోని తరాబా రాష్ట్ర గవర్నర్‌కు చెందిర విమానం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో విమానం నడుపుతున్న గవర్నర్ సుంతయితోపాటు ఆయన సిబ్బంది. ఐదుగురికి గాయాలయ్యాయి. సెన్నా 208 అనే విమానం జిలాంగో నుంచి గవర్నరతో పాటు ఆరుగురు సిబ్బందితో బయలుదేరింది. కొద్దిసేపటికే విమానం సరిహద్దు రాష్ట్రమైన అడమవలోని యోలా ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతూ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో గాయపడ్డ గవర్నర్ తదితరులను సమీప ఆసుపత్రికి తరలించారు.



