నైట్ బజార్ సందర్శించిన సీఎం
హైదరాబాద్: జీవ వైవిధ్య సదస్సుకు హాజరైన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో పాటు మంత్రులు జానారెడ్డి వెంకటరెడ్డి, దానం నాగేందర్, ప్రసాదరావు శిల్పారాయంలోని నైట్ బజార్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా నైట్ బజారులో ఏర్పాటుచేసిన ఒంగోలు గిత్తల బ్రీడింగ్ బుల్స్ ప్రదర్శన స్టాల్‌ని సీఎం ప్రారంభించారు. ఒంగోలు జాతి గిత్తలను చూసి వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు.



