న్యాయస్థానాల్లో తెలుగుభాష వినియోగం సాధ్యాసాధ్యాలు

ప్రజాస్వామ్య సౌధానికి భాషే పునాది. ప్రజల భాషలో ప్రభుత్వ ప్రయా ణం సాగితే, ప్రభు త్వ కార్యకలా పాలలో పార దర్శకత ఏర్పడు తుంది. దానివల్ల ప్రజలు చైతన్య వంతులవుతారు. ప్రజా స్వామ్య ప్రక్రియలో అన్ని వర్గాల భాగస్వామ్యం ఏర్ప డుతుంది. అది ప్రజా స్వామ్యాన్ని పరిపుష్టం చేస్తుంది. న్యాయస్థానాల్లో ప్రధాన భాషే ప్రధా న మాధ్యమమైతే కక్షిదారుకి తెలుస్తుంది. న్యాయస్థానాల్లో ఎప్పట ికప్పుడు ఏం జరుగుతుందో తెలుస్తుంది. శాసనాలు ప్రజల భాషలో వుంటే అవి సామాన్యుడికి అందుబాటులో ఉంటాయి. దానివల్ల ప్ర జలకి తమ హక్కులు బాధ్యతలు తెలుస్తాయి. వాళ్లు తమ హక్కులని నిశ్చయం చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. మ బాధ్యతని నిర్వర్తించే అవకాశం ఏర్పడుతుంది. తమ హక్కుల పరిరక్షణ కోసం ప్రజలు మరెవరిపైనా ఆధారపడే పరిస్థితి వుండదు. శాసన, కార్యనిర్వాహక, న్యాయపాలనా వ్యవస్థల్లో ప్రజల భాష వుంటే ఖచ్చితంగా అది ప్ర జలను చైతన్యవంతం చేస్తుంది. అదే ప్రజాస్వామ్యానికి స్ఫూర్తి, పునా ది.మాతృభాష బాల్యదశ నుంచి జీవిత చరమాంకం వరకు వుండేది. తల్లిపాలతో బాటు అలవడిన భాష. నిత్య వ్యవహారంలో వుండే భాష. మనుషులు ఎన్ని భాషలు మాట్లాడినా అసంకల్పిత భావాలని వ్యక్తపరిచేది మాతృభాషలోనే. అలాంటి భాషకి ప్రాధాన్యత తగ్గి అన్య భాష ప్రాధాన్యత రోజురోజుకీ పెరిగిపోతుంది. ఇంగ్లిష్‌ చాలా అవ సరమైన భాష. అది ప్రపంచాన్ని శాసిస్తుంది. ఇంగ్లిష్‌ పరిజ్ఞానం ప్రతి ఒక్కరు సంపాదించాల్సిందే. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి బేధా భిప్రాయాలు లేవు. అయితే మనదేశంలో చాలామంది ప్రజలు పల్లెల్లో జీవిస్తున్నారు. ఇంగ్లిష్‌ తెలియని వారే నూటికి తొంబైశాతం వున్నా రు. ఇలాంటి పరిస్థితుల్లో మనదేశంలో ప్రజల భాషలో శాసన న్యా య పాలన వ్యవస్థల్లో ప్రజల భాష లేకపోవడం ఆందోళన కలిగించే విషయం. ప్రతిదానికి ఇంగ్లిష్‌ని ఆశ్రయించడం వల్ల తెలుగులో భావ ప్రకటన సామర్థ్యం తగ్గిపోయింది. మున్ముందు ఇంకా తగ్గిపోయే అవ కాశం వుంది.

జనసామాన్యం తరచు ఆశ్రయించాల్సిన రాజ్య వ్యవస్థల్లో న్యాయపాలన ఒకటి. ఏ చట్టాన్ని చూసినా అందులో నిబంధనలు, ఉప నిబంధనలు నియమాలు ఇట్లా ఎన్నో వుంటాయి. వాక్యాలు కూ డా సుదీర్ఘంగా వుంటాయి. వీటివల్ల చట్టాన్ని అర్థం చేసుకోవడం సం క్లిష్టంగా మారుతుంది. వీటికి తోడు పరాయి భాష. ఇది ఇనుపతెరగా అందర్ని బాధిస్తుంది. మన దేశంలో న్యాయం కోసం ఆశ్రయించే వారిలో చాలా మంది న్యాయ పరిజ్ఞానం వున్న వ్యక్తులుకారు. అక్షరా స్యులు కారు. ఇలాంటి దేశంలో కోర్టుల తీర్పులు మాతృభాషలో వుం డటం అత్యంత అవసరం. తీర్పు వెలువడిన క్రమాన్ని జనం బాగా అర్థం చేసుకోగలుగుతారు.1872 సంవత్సరానికే ‘ప్రీవీ కౌన్సిల్‌ తీర్పు ల సంగ్రహణం’ అని తెలుగులో ఒక తీర్పుల పుస్తకం వుండేదట. అది బళ్లారి నుంచి ప్రకటితం. గ్రంథకర్త పేరు పదక్కి తిరుమలరావు. గతంలో న్యాయవాద పరీక్షలు తెలుగులోనే జరిగిన దాఖలాలు ఉన్నా యి. 134 సంవత్సరాల కిందట తెలుగులో తీర్పుల పుస్తకం వచ్చి ందన్నమాట. అలాంటిది ఇప్పుడు తెలుగులో తీర్పులు వస్తే అబ్బు రపడి కీర్తించే పరిస్థితి ఏర్పడింది. భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన రాష్ట్రంలోనే భాష అంతరించిపోతుందన్న ఆందోళన వుంది. ఈ ఆం దోళనకి సహేతుకత కూడా ఉంది. ఎందుకంటే తెలుగు చదివే విద్యా ర్థుల సంఖ్య రోజురోజుకి తగ్గిపోతుంది. తెలుగు భాషాభివృద్ధి కోసం తెలుగు అకాడమీ, తెలుగు విశ్వవిద్యాలయం, అధికారభాషా సంఘం లాంటి సంస్థలు వున్నప్పటికీ సరైన స్థానం మన రాష్ట్రంలో లేదు. దానికి కారణం ప్రభుత్వం నుంచి తెలుగుకి సరైన ఆదరణ లేకపో వడమే.ఇక న్యాయస్థానాల విషయానికొస్తే తెలుగులో న్యాయశాస్త్ర పుస్తకాలు లేవు. కోర్టుల్లో తెలుగుభాష లేదు. శాసనాలన్నీ ఇంగ్లి షులోనే. ఇది మన రాష్ట్ర పరిస్థితి. హిందీ భాషారాష్ట్రాల్లో కోర్టు పరి భాష అంతా హిందీనే. శాసనాలు కూడా హిందీలోనే వున్నాయి. తమిళనాడులో కూడా కోర్టు పరిభాష తమిళమే. మన తెలుగు రాష్ట్ర ంలో తెలుగుభాష కోర్టులో లేకపోవడానికి కారణం ఏమిటీ అన్న ప్రశ్న సహజంగా వస్తుంది. సమైక్య రాష్ట్రం ఏర్పడకముందు, హైదరా బాద్‌ రాష్ట్ర హైకోర్టుతో పాటు దిగువ కోర్టు వ్యవహారాలన్ని పూర్తిగా ఇంగ్లిష్‌లోకి మారిపోయాయి. హైదరాబాద్‌ రాష్ట్రంలో ఉర్దూను అమ లు పరిచినపుడు, సమైక్య ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు అమలు పర చలేమా? తెలుగు కోర్టుల పరిభాష కాకపోవడానికి కారణం పాల కుల్లో చిత్తశుద్ధి లేకపోవడం కదా! హైకోర్టుల్లో ఇంగ్లిషు భాష అవస రమేమోగానీ, దిగువ కోర్టుల్లో వ్యవహారాలు తెలుగులో లేకపోవడం వల్ల కోర్టుల్లో ఏం జరుగుతుందో పార్టీలకు తెలియదు. అందువల్ల వాళ్లు తీవ్రమైన అసౌకర్యానికి లోనవుతున్నారు.మొన్నీమధ్య ఒక అమ్మాయి తన చెల్లెలు ఆత్మహత్య చేసుకున్న కేసులో సాక్ష్యం ఇవ్వ డానికి కోర్టుకి వచ్చింది. ఆమెను ప్రశ్నలు తెలుగులో అడిగారు. ఆమె సమాధానాలు తెలుగులోనే చెప్పింది. కానీ వాటిని రాసుకోవడం మా త్రం ఇంగ్లిషులోనే జరిగింది. సాక్షిని క్రాస్‌ ఎగ్జామిన్‌ చేస్తున్న తరు ణంలో ముద్దాయి ఎలాంటి నేరం చేయలేదన్న సూచనలు ముద్దాయి న్యాయవాది సాక్షికి సూచిస్తారు. సాక్షి కాదు అని సమాధానం చెప్పి నపుడు కోర్టు, దాని వ్యతిరేక భావనలో నమోదు చేయడం జరుగుతుంది. ఆ నమోదు చేసిన క్రమం అంతో ఇంతో ఇంగ్లిషు తెలి సిన సాక్షులకు కూడా అర్థం కాదు. తాము చెప్పింది కోర్టు నమోదు చేయడం లేదన్న భావనకు రావడం జరుగుతుంది. ఆ అమ్మాయి అదే విషయం కోర్టుకు చెబుతూ సంతకం చేయడానికి నిరాక రించింది. సాక్షుల పరిస్థితి ఇలావుంటే ముద్దాయిల పరిస్థితి ఎలా వుంటుందో చెప్పడానికి వీల్లేదు.హైకోర్టు తప్ప మిగతా అన్ని కోర్టు ల్లోని భాషని నిర్దేశించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికుంది. సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్‌, క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ ఈ విషయాలను నిర్దేశి స్తాయి. హైకోర్టులో సంప్రదించి కార్య వ్యవహారాలు ఏ భాషలో జర గాలో ప్రభుత్వం నిర్దేశించవచ్చు. దిగువకోర్టుల్లో కోర్టు వ్యవహారాలు తెలుగులో జరగవచ్చని ప్రభుత్వం నిర్దేశించింది. కానీ ఏ కోర్టులో కూడా ముద్దాయికి తెలిసే అవకాశం లేదు. అలాగే తమ కేసు ఎందు కు వీగిపోయిందో సివిల్‌ కేసులోని వాదికి తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే తీర్పులన్నీ ఇంగ్లిషులోనే వెలువడుతాయి. ఇంగ్లిష్‌లోనే వుండటం వల్ల పార్టీలు విసిగి న్యాయవాదులపైనే ఆధారపడవలసిన అవసరం ఏర్పడుతుంది. వారు కేసు ఎందుకు వీగిపోయిందో, ఎం దుకు శిక్షపడిందోతమ న్యాయవాది మాటలనే నమ్మవలసి వసు ్తంది.

ఈ దుస్థితి నుంచి బయట పడాలంటే కోర్టుల్లో తెలుగు భాషను నిర్బంధం చేయవలసిన అవసరం ఉంది. అవి జరుగనపుడు కోర్టుకి ప్రజలకి అంతరం పెరిగిపోతుంది. కోర్టులు ప్రజలకు చేరు వయ్యే అవకాశం లేదు. కోర్టుల మీద వున్న ఆమాత్రం విశ్వసనీయత కూడా పోయే పరిస్థితి ఏర్పడుతుంది. కోర్టుల్లో తెలుగు భాషని నిర్బం ధం చేయడం వల్ల రెండు సమస్యలు ఉత్పన్నం అయ్యే అవకాశం ఉంది. న్యాయవాదులు తమ దరఖాస్తుల కాంప్లేంట్‌లని ఇంగ్లిషులోనే రాయడానికి అలవాటుపడ్డారు. అట్లాగే న్యాయమూర్తులు కూడా ఇం గ్లిషులోనే తీర్పులు చెప్పడానికి అలవాటు పడ్డారు. అంటే న్యాయ వాదులకు, న్యాయమూర్తులకు ఇంగ్లిషు బాగా వస్తుందని కాదు. తెలుగు అర్థం చేసుకొని దాన్ని ఇంగ్లిషులోకి అనువదించడం వలన న్యాయవాదుల, న్యాయమూర్తులు మానసిక శ్రమకు ఒత్తిడులకు గురి కావలసి వస్తుంది. ఈ 50 సంవత్సరాల్లో ఇంగ్లిషులోనే తీర్పు వెలు వరించడానికి న్యాయమూర్తులూ, తమ దావాలను ఇంగ్లిషులోనే రాయడానికి న్యాయవాదులూ అలవాటుపడ్డారు. ఇది మొదటి సమ స్య. ఇక రెండో విషయానికి వస్తే హైకోర్టుకి సుప్రీంకోర్టుకి ఈ కేసు లు వెళ్లినపుడు అక్కడ వీటిని అర్థం చేసుకోవడానికి సమస్య తలె త్తుతుంది. ఈ సమస్యని అధిగమించాలంటే ఏం చేయాలి?తెలుగు శాసనాలు పరభాషలో లేనప్పుడు తెలుగులో తీర్పు చెప్పడం అంత సులువుకాదన్న వాదన కూడా వస్తుంది. ఇందులో కొంత వాస్తవం ఉంది. తెలుగులో శాసనాలు లేవు. వ్యాఖ్యానంతో కూడిన పుస్తకాలు లేవు. ఒకటి అరా వున్నా అవి చదువలేనంత భయంకరంగా వుంటా యి. ఇప్పుడు పరిస్థితి కాస్త మెరుగు పడుతుంది. న్యాయశాస్త్ర పుస్త కాలు వ్యవహారిక భాషలో వస్తున్నాయి. ఈ వచ్చిన పుస్తకాలు ఆయా రచయితల ఆసక్తితో వచ్చిన పుస్తకాలు మాత్రమే. ఏ ప్రభుత్వ సంస్థల ప్రోత్సాహంతో వచ్చినవి కావు. ఇవన్ని కూడా కొంతమేరకే కోర్టుకి తెలుగు భాషను అమలు పరచడంలో ఉపయోగపడతాయి. సాం కేతిక పదాల అనువాదాలకు సంబంధించి వ్యవహార కోణాలు కూడా బాగానే వెలువడినాయి. భాషాభావృద్ధికి నిఘంటువులు పదకోశాల నిర్మాణ సాధనాల వంటివి. ఆ ప్రక్రియ నిరంతరం కొనసాగాల్సి వుం టుంది. ఇంగ్లిషులో కొత్త పదాల సృష్టి జరుగుతుంది. వాటికి తెలుగు పదాల ఆవశ్యకత ఏర్పడుతుంది. అందుకని పదకోశాల నిర్మాణం నిరంతరం జరుగుతూ ఉండాలి.దిగువ కోర్టుల్లోని వ్యవహారాలన్నీ తెలుగుభాషలో జరగాల్సిన అవసరం ఎంతయినా వుంది. అయితే సుప్రీం కోర్టు, హైకోర్టు తీర్పులన్నీ కూడా ఇంగ్లిషులోనే వుంటాయి. దిగువ కోర్టులు తీర్పులు చెప్పేక్రమంలో ఆ కేసులని ఉదహ రించవలసి వస్తుంది. వాటిని తెలుగులోకి అనువాదం చేయడం సుల భతరంకాదు. దీనివల్ల కేసుల పరిష్కారంలో మరింతజాప్యం జరిగే అవకాశముంది. ఈ సమస్యలు వున్నప్పటికీ కోర్టు వ్యవహారాలన్నీ కూడా తెలుగులోనే జరగాలని చాలామంది అభిమతం. అవసరం కూడా. ఈ సమస్యలను అధిగమించడానికి నాకు తోచిన మార్గాలు కొన్ని.

1) తెలుగులో తీర్పులు ప్రకటించాలన్న నిబంధనని క్రమపద్ధతిలో అమలు చేయాలి.

2) ఒక న్యాయమూర్తి నెలలో వెలువరించే 25 శాతం తీర్పులని తెలుగులోనే వెలువరించాలన్న నిబంధన ఏర్పరచాలి. లేదా ఇంగ్లిషులో వెలువరించిన తీర్పులను తెలుగులోకి అనువాదం చేసే వ్యవస్థని ప్రతికోర్టులో ఏర్పాటు చేయాలి.

3) తీర్పు వెలువడిన రోజే అందే విధంగా మన రాష్ట్రంలో వచ్చే శాసనాలు జీవోలు తెలుగులోనే రాయాలి. తెలుగులో వచ్చిన వాటిని ఇంగ్లిషులోకి అనువదించాలి. దేశానికి వర్తించే చట్టాలని ఇప్పటికే రాష్ట్రంలో ఇంగ్లిషులో వచ్చిన చట్టాలని ప్రభుత్వం తెలుగులో అనువదించాలి. అనువాదం కోసం ఆ రంగంలో చేయి తిరిగిన వ్యక్తుల సహకారం తీసుకోవాలి.

ఇటీవల కాలంలో న్యాయస్థానాల పాత్ర ప్రజాజీవితంలో ఒక ప్రధాన భాగమైపోయింది. శాసనాల సంఖ్య పెరిగిపోయింది. కోర్టులకి వచ్చే ప్రజల భాషలో కోర్టు వ్యవహారాలు జరగడం అత్యంత ఆవశ్యం. ఇందుకోసం అవసరమైన ధనాన్ని వెచ్చించాల్సిన అవసరం ప్రభుత్వంపైన ఉంది. ఇది కూడా ప్రజల సంక్షేమం కోసమే. తెలిసిన భాషలోనే న్యాయం జరిగితే న్యాయం పట్ల గౌరవం ఏర్పడుతుంది. జరిగింది న్యాయమా కాదా! అన్న విషయం తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అట్లాంటి అవకాశం వున్నప్పుడే న్యాయా ధిక్యం ఉనికి వుంటుంది.