న్యూస్‌ ఛానళ్ల ప్రసారాలను నిలిపివేసిన సర్కారు

హైదరాబాద్‌: తెలంగానోడి దెబ్బకు సీమాంద్ర సర్కారుకు ముచ్చెమటలు పట్టాయి. తెలంగాణ మార్చ్‌కు తరలి వచ్చిన ఆశేష జనవిహినికి భయపడి, కార్యక్రమం విజయవంతం అయినందున వార్తలను యావత్‌ ప్రపంచం తెలుసుకోకూడదు అన్న ఆలోచనతో రాష్ట్రంలోని అన్ని న్యూస్‌ ఛానళ్ల ప్రసారాలను నిలిపివేసింది. తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుకోవడానికి పన్నిన కుట్రలు బయట పడుతాయనే ఈ నీతిమాలిన చర్యలకు ప్రభుత్వం పాల్పడిందని తెలంగాణవాదులు మండిపడుగున్నారు.