పంచాయతీ రాజ్ లొ అవినీతి చేప..
7వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ రాజ్ ఎ ఈ.
ధైర్యంగా సమాచారం ఇవ్వండి
– ఏసీబీ డిఎస్పి రమణమూర్తి.
రాజన్న సిరిసిల్ల బ్యూరో.మే20.(జనం సాక్షి). అసలే చేసిన పనులకు బిల్లు రాక ఏళ్ళ తరబడి తిరిగి తిరిగి వేసారి పోతున్న కాంట్రాక్టర్లకు అధికారుల అవినీతి మరింత తలనొప్పిగా మారింది. స్మశాన వాటిక కాంపౌండ్ వాల్ నిర్మించిన కాంట్రాక్టర్ బిల్లుల కోసం పంచాయతీ రాజ్ కార్యాలయం చుట్టూ తిరిగి తిరిగి వేసారి పోయాడు. బిల్లులు పై అధికారులకు పంపాలంటే 8వేల రూపాయలు లంచం ఇస్తేనే పనవుతుందంటూ పంచాయతీరాజ్ ఏ.ఈ ,తెలపడంతో చిరకు కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించారు. సోమవారం రోజున కలెక్టరేట్లోని పంచాయతీరాజ్ విభాగంలో ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించి కాంట్రాక్టర్ నుండి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్సీ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం….
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో స్మశాన వాటిక కాంపౌండ్ వాల్ నిర్మాణం చేసిన కాంట్రాక్టర్ వెంకటేష్ బిల్లుల కోసం పంచాయతీరాజ్ అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. నాలుగు నెలల క్రితం కాంపౌండ్ వాల్ నిర్మాణానికి సంబంధించిన బిల్లులు మొత్తం పంచాయతీరాజ్ ఎ, ఈ,భాస్కర్ రావుకు అందజేశారు. ఏ ఈ,భాస్కర్ రావు ఎనిమిది వేల రూపాయలు లంచం ఇస్తేనే ఎంబి చేస్తానంటూ
తెలపడంతో నివ్వెర పోయిన కాంట్రాక్టర్ వెంకటేష్ అంత ఇచ్చుకోలేనంటూ బతిమిలాడడంతో 7000 రూపాయలకు తగ్గించాడు. తన వేధిస్తున్న అధికార తీరుపై ఏసీబీ అధికారులకు వెంకటేష్ ఫిర్యాదు చేయడంతో కలెక్టరేట్ సముదాయంలోని పంచాయతీ రాజ్ కార్యాలయంలో దాడులు నిర్వహించిన అధికారులు 7వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏఈ ,భాస్కర్ రావు ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు తెలిపారు. భాస్కరరావును ఏసీబీ కోర్టులో హాజరు పరుచున్నట్లు ఉన్నట్లు ఏసీబీ డిఎస్పి రమణమూర్తి తెలిపారు. అధికారులు లంచం కోసం వేధిస్తే ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయాలని తెలిపారు. జిల్లా కేంద్రంలో జరిగిన ఈ ఘటన చర్చ నిమిషం గా మారింది.