పంట నష్టపోయిన రైతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలిపంట నష్టపోయిన రైతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి
ఝరాసంగం మార్చి 20( జనం సాక్షి )గత మూడు రోజులుగా జిల్లాలో అల్పపీడన ద్రోని తుఫాను వల్ల పడిన వర్షాలకు రైతులు నష్టపోయారని వై ఎస్ ఆర్ టి పి నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. గత రాత్రి జిల్లా వ్యాప్తంగా వీచిన గాలులు కురిసిన వడగళ్ల వర్షం వల్ల వేలాది ఎకరాలలో పంట నష్టం జరిగిందని వారన్నారు వై ఎస్ ఆర్ టి పి అధ్యక్షురాలు వై ఎస్ షర్మిళమ్మ వికారాబాద్ పంట పొలాలు పర్యటన కు మద్దత్తు తెలుపుతూ సంగారెడ్డి జిల్లా నాయకులు మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు మొక్కజొన్నకు ఎకరానికి 50,000 వేలు వరి పంటకు 40 వేలు మరియు ఉద్యానవన పంటలకు ఎకరానికి లక్ష రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా ఇంచార్జి సాయినాథ్ రెడ్డి, జిల్లా యువజన సంఘం అధ్యక్షులు సతీష్, జహీరాబాద్ టౌన్ ప్రెసిడెంట్ మంతుర్ దత్తు రెడ్డి అభిషేక్, దేవరం పల్లి యువ నాయకులు బంటు బాగ్యారాం, తదితరులు పాల్గొన్నారు