పది మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తాం

– శాసన మండలిలో మంత్రి లక్ష్మా రెడ్డి

హైదరాబాద్‌, అక్టోబర్‌30(జ‌నంసాక్షి) : రాష్ట్రంలో పది మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వైద్య, ఆరోగ్య, సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ సీ.లక్ష్మారెడ్డి తెలిపారు. సోమవారం ఆయన శాసనమండలిలో ఈ అంశంపై మాట్లాడుతూ తెలంగాణలో విభజనకు పూర్వం ఉన్న ప్రతి జిల్లాలోనూ ఓ మెడికల్‌ కాలేజీని ఏర్పాటు చేస్తామన్నారు. దీనిలో భాగంగానే సీఎం కేసీఆర్‌ ఇటీవల నల్లగొండ,

సూర్యాపేట జిల్లాలకు రెండు మెడికల్‌ కాలేజీలను ప్రకటించారని గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆరు వైద్య కళాశాలలు ఉన్నాయని, మెదక్‌లో ఏర్పాటు చేయబోయే కాలేజీ అనుమతి కోసం ఎదురు చూస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లోని అండర్‌గ్రాడ్యుయేట్‌, పోస్టుగ్రాడ్యుయేట్‌ కోర్సులకు అధిక సీట్లను తీసుకురావడంలో తెలంగాణ ప్రభుత్వం సఫలమైందని మంత్రి చెప్పారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో భూమిని సేకరించిన తర్వత కాలేజీల అనుమతి కోసం మెడికల్‌ కౌన్సిల్‌కు ప్రతిపాదనలు పంపనున్నట్లు ఆయన తెలిపారు. ఆయుష్‌ ¬మియోపతి సేవలను కూడా అభివృద్ధి పరిచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆయుష్‌ పథకంలో భాగంగానే బల్కంపేట నేచర్‌ క్యూర్‌ హాస్పటల్‌ను అభివృద్ధి పరుస్తున్నట్లు ఆయన తెలిపారు