పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దిష్టి సారించాలి – హరిపురంలో స్వచ్ఛభారత్ మిషన్ రెండో శానిటేషన్ ప్లాన్ పై అవగాహన సదస్సు
ముత్తారం జనంసాక్షి/ రెండో విడుత స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ప్రతి గ్రామంలో పారిశుధ్య పైన ప్రత్యేక దృష్టి సారించాలని గ్రామంలోని ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని స్వచ్ఛభారత్ శిక్షణ అధికారి రాఘవులు అన్నారు. శుక్రవారం రోజున ముత్తారం మండలంలోని హరిపురం గ్రామంలో స్వచ్ఛ భారత్ మిషన్ రెండో విడత కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు హరిపురం గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణపై గ్రామ చిత్రపటం గీసి ప్రజలతోపాటు వివిధ శాఖల అధికారులకు పలు అంశాలపై శిక్షణ ఇచ్చారు. సర్పంచ్ వేల్పూరి సంపత్ రావు అధ్యక్షతన నిర్వహించిన స్వచ్ఛభారత్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ జక్కుల ముత్తయ్య, జెడ్పిటిసి స్వర్ణలత అశోక్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు నూనె కుమార్, ఏపీ డి సత్యనారాయణ, ఎంపీడీవో కే. శ్రీనివాస్, ఎస్ బి ఎం రేణుక వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిక్షణ అధికారి రాఘవులు మాట్లాడుతూ రెండవ రోజు హరిపురం గ్రామంలో శానిటేషన్ ప్లాన్ గ్రామంలోని సర్పంచులు, ఎంపిటిసిలు, గ్రామపంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, తదితర శాఖల అధికారులతో గ్రామంలో శిక్షణ ఏర్పాటు చేయడం జరిగిందని దీనిలో భాగంగా డ్రైనేజీ శుభ్రత తడి చెత్త, పొడి చెత్త, మరుగుదొడ్ల నిర్మాణం వాడకం ఇంకుడు గుంతలు, ప్లాంటేషన్ తదితర అంశాలపై స్వచ్ఛభారత్ మిషన్ శిక్షణ బృందం గ్రామంలో పర్యటించి గ్రామ ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు.ప్రతి ఇంట్లో రెండు గుంతల మరుగుదొడ్డి, జంక్షన్ బాక్స్ వుండేవిధంగా ఏర్పాటు చేసుకోవాలి అని వివరించారు. ప్రతి మూడు సంవత్సరాలకు జంక్షన్ బాక్స్ సహాయం తో పిట్ యొక్క డైరక్షన్ మార్చి, రెండవ పిట్ కూడా నిండే సమయానికి మొదట నిండిన పిట్ లోని మలం ఎరువు గా తయారవుతుందని వివరించారు.గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కే. శ్రీనివాస్, ఏపీఓ దయామని, ఏపిఎం పద్మ, టెక్నికల్ అసిస్టెంట్లు ఓంకార్, సర్పంచులు సిరికొండ బక్కరావు, సతీష్ గౌడ్, నెత్తెట్ల మహేందర్ యాదవ్, తుంగాని సమ్మయ్య యాదవ్, ఎంపీటీసీలు కిషన్ రెడ్డి, తోపాటు సంబంధిత శాఖ అధికారులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Related