పరీక్ష రాయలేకపోయిన విద్యార్థులు
కడప : వైఎస్‌ఆర్ జిల్లా ఇడుపులపాయ ట్రిపుల& ఐటీ హాస్టల్‌లో ఆహారం విషతుల్యం కావడంతో వెయ్యి మంది విద్యార్థులు పరీక్ష రాయలేకపోయారు. విద్యార్థుల నిరసన కొనసాగుతోంది. కెఎంకె మెస్‌లో ఆదివారం రాత్రి ఆహారం విషతుల్యం కావడంతో విద్యార్థులు సోమవారం ఉదయం అల్ఫాహారం తీసుకోకుండా బహిష్కరించారు. మధ్యాహ్న భోజనం కూడా చేయలేదు. 1950 మంది విద్యార్థులు భోజనం చేయలేదు. ఐదుగురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది. వారిని కడప రిమ్స్‌కు తరలించారు.



