పశ్చిమ దిశగా కదులుతున్న తీవ్ర వాయుగుండం
విశాఖ: బంగాళాఖాతంలో విశాఖకు తూర్పు ఆగ్నేయ దిశలో 600 కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. ఇది క్రమంగా పశ్చిమ దిశగా కదులుతూ తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది, తీరం వెంబడి గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని.. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. రాష్ట్రంలోని అన్ని ఓడరేవుల్లోనూ ఒకటో నంబరు ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు.



