పసికందును చంపబోయిన కసాయి తండ్రి

విజయవాడ, ఆడపిల్ల పుట్టిందంటూ ఓ తండ్రి నాలుగు రోజుల పసికందును చంపబోయాడు . పసికందును నేలకేసి కొట్టి గొంతుపై కాలు పుట్టబోగా మాతృమూర్తి అడ్డుకుని తన కూతురు ప్రాణాలను కాపాడుకుంది. ఈ ఘటన ఇంచుపేటలో చోటు చేసుకుంది. పసికందును నేలకేసి కొట్టడంతో స్వల్ప గాయాలయ్యాయి. దీంతో చికిత్స నిమిత్తం చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. శిశువు తల్లి భర్తపై పోలీసులుకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు సమాచారం.