పాక్‌ను పర్యటించనున్న ప్రధాని

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో పర్యటించేందుకు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఎలాంటి షరతులు విధించలేదని భారత విదేశాంగశాఖ మంత్రి ఎన్‌.ఎం.కృష్ణ అన్నారు. ఉగ్రవాదంపై పోరుకు మరోసారి చిత్తశుద్ధితో పనిచేయాలని ఇరు దేశాలు అంగీకరించినట్లు తెలిపారు. పాకిస్థాన్‌ జైళ్లలో శిక్ష ముగించుకున్న మత్స్యకారులను విడుదల చేయడాన్ని ఆయన స్వాగతించారు.