పాక్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు : 103 మంది మృతి

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లోని క్వెట్టాలో ఉగ్రవాదులు మరోసారి మారణకాండ సృష్టించారు. బలుచిస్తాన్‌, ఖైబర్‌- పక్తుంఖ్యా ప్రాంతాల్లో వరుసగా ఆరు చోట్ల బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. షియా ముస్లింలు లక్ష్యంగా బాంబు దాడులు చేసినట్లు సమాచారం.ఈ బాంబు దాడుల్లో 103 మంది దుర్మరణం చెందారు. 200 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పేలుళ్లు జరిగిన చోట్ల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. లష్మర్‌ ఇ జంగ్వీ అనే ఉగ్రవాద సంస్థ పేలుళ్లకు బాధ్యత ప్రకటించినట్లు తెలుస్తోంది.