పాఠశాలలకు జియోమ్యాపింగ్‌ 

వివరాలు నమోదుతో సమాచారం సులువు
హైదరాబాద్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి):  రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, గురుకులాలు, ఎయిడెడ్‌ ఇలా అన్ని రకాల పాఠశాలలను  జియో మ్యాపింగ్‌ పరిధిలోకి తీసుకురావడానికి పాఠశాల విద్యాశాఖ సన్నాహలు చేస్తున్నది. విద్యాహక్కు చట్టంలో పేర్కొన్న నియమ నిబంధనల ప్రకారం జియో మ్యాపింగ్‌  చేయనున్నారు. దానిని బట్టి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు కచ్చితంగా నిధులు కేటాయించవచ్చు. టీచర్లు, స్కూళ్ల హేదుబద్ధీకరణ ప్రక్రియ చేపట్టడానికి కూడా ఈ విధానం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
అధికారులు ఎలాంటి తప్పులు చేయడానికి అవకాశం ఉండదని అధికారులు భావిస్తున్నారు. మద్యాహ్న భోజన పథకం, ఉచిత యూనిపారాల పంపిణీ, ఉచిత పాఠ్యపుస్తకాల పంపిటనీ వంటి విద్యాభివృద్ధి పథకాలను పకడ్బందీగా నిర్వహించడంతో పాటు ఏయే పాఠశాలల్లో ఎంతెంత ఎన్‌రోల్‌మెంట్‌ ఉన్నది?అక్కడ ఎంత మంది టీచర్లు పని చేస్తున్నారు అన్న వివరాలు ఎప్పటికప్పుడు స్పష్టంగా తెలుస్తాయి.  రాష్ట్రంలోని  అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను అంటే దాదాపు  40,821 పాఠశాలలను జియెమ్యాపింగ్‌ పరిధిలోకి తీసుకువస్తున్నారు. సమగ్ర సమాచారం తెలుసుకోవడానికి వీలుగా విద్యాశాఖ గణాంకాలను సైతం జోడించనున్నారు. జిల్లా ఇన్ఫర్మేషన్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ (డైస్‌) సమాచారాన్ని
కూడా పాఠశాలల వారీగా జియో మ్యాపింగ్‌ పరిధిలోకి తీసుకెళ్లనున్నారు. ముఖ్యంగా ఏయే పాఠశాలల్లో కనీస వసతి సదుపాయాలు ఉన్నాయి?  ఇంకా ఎన్నిపాఠశాల్లో వసతులు ఏర్పాటు చేయాలి? మరుగుదొడ్లు, సైన్స్‌ల్యాబ్‌లు, గ్రంథాలయాలు, తరగతి గదులు, వాటికి తలుపులు, కిటికీలు ఉన్నాయా?లేదా ? అన్ని వివరాలు తెలుసుకోవగానికి జియోమ్యాపింగ్‌ చాలా ఉపయోగపడుతుందని ఆ శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. లోపాలను సరిదిద్దడానికి కావాల్సిన బడ్జెట్‌ అంచనాలు తయారు చేయడానికి కూడా ఈ విధానం దోహదపడుతుంది. ఒక స్కూల్‌కు మరో స్కూల్‌కు మధ్య ఎంత దూరం ఉంటుంది అన్న వివారాలు సైతం తెలుస్తాయి. దానివల్ల కొత్త పాఠశాలు పెట్టాలన్నా, విద్యార్థులకు రవాణా ఖర్చులు చెల్లించాలన్నా అందుకు సంబంధింయిన వాస్తవ వివరాలు తెలుసుకోవచ్చు. ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మేల్సీలు వంటి ప్రజాప్రతినిధులు నిధులు  కేటాయించడానికి కూడా అవకాశం ఉంటుంది. జియోమ్యాపింగ్‌లో ప్రతి స్కూల్‌కు సంబంధించిన ఎనిమిది రకాల ఫొటోలను అప్‌లోడ్‌ చేస్తారు. వాటిని ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తారు. దీనివల్ల విద్యాశాఖ డైరెక్టర్‌గాని, విద్యాధికారులతో పాటు ప్రజలు కూడా నేరుగా పాఠశాలల పరిస్థితులను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. జియో మ్యాపింగ్‌ పనులు రెండు నెలల్లో పూర్తి కానున్నాయి. ఆర్క్‌ జియో అనే నూతన సాఫ్ట్‌వెర్‌ను రూపొందింయడంతోపిటు ప్రత్యేకంగా ఓ వెబ్‌సైట్‌ పప్రారంరభిస్తున్నారు. ఇందుకు సంబంధింయిన పనులు ఎన్‌ఐసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి.

తాజావార్తలు