పాఠశాల విద్యలో పెరుగుతున్న ప్రమాణాలు

సర్కార్‌ చర్యలతో తగ్గుతున్న డ్రాపౌట్లు
హైదరాబాద్‌,ఫిబ్రవరి13(జ‌నంసాక్షి): పాఠశాల విద్యలో ప్రమాణాలు పెరగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న విద్యాభివృద్ధి పథకాల వల్ల భవిష్యత్తులో డ్రాపవుట్ల రెటు మరింత వేగంగా తగ్గిపోయే సూచనలు కనిపిస్తున్నాయని సంబంధిత వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒకటోతరగతిలో చేరే విద్యార్థుల సంఖ్య తగ్గతుండగా..  పదో తరగతిలో ఉత్తీర్ణత శాతం మాత్రం ఎప్పటికప్పుడు మెరుగు పడుతూ వస్తున్నది. మార్చి2006లో ఎస్‌ఎస్‌సిలో ఉత్రీర్ణులైన విద్యార్ధులు 74.70 శాతం కాగా.. మార్చి2016 నాటికి ఈ ఫలితాలు 85.63 శాతానికి చేరుకున్నాయి.గడిచిన పదేండ్లలో పదోతరగతి ఉత్తీర్ణత శాతతం 10.93 శాతతం పెరిగింది.  పదేండ్లుగా టీచర్‌, విద్యార్థి నిష్పత్తిలో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. 2016-17 లో ఉన్నత పాఠశాలల్లో 28 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యయుడు లేదా ఉపాధ్యాయురాలు ఉండగా.. ప్రస్తుతం 30 మంది విద్యార్థులకు ఒక టీచర్‌ చొప్పున ఉంటున్నారు. మొత్తంగా స్కూళ్ల ప్రమాణాలు మరింతగా పెరిగితే మంచిదన్న అభిప్రాయామూ ఉంది. జనాభా నియంత్రణ పక్కాగా అమలువుతోందని గణాంకాలు చెబుతున్నాయి. దీంతో జననాలు తగ్గుతున్నాయి. ఈ లెక్కలు పాఠశాల ప్రవేశాల ద్వారా పక్కాగా తెలుస్తున్నాయి. యువత పెరుగుతున్నా వారు మాత్రం ఒకరు మాత్రమేచాలనుకుంటున్నారు. గతంలో లాగా ఒకరికి మించి కనడం లేదు. దీనికితోడు పోషణ భారం కూడా వారిని ఒక్కరికే పరిమితం చేస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు అన్ని రకాల పాఠశాలల్లో ఒకటవ తరగతిలో చేరుతున్న విద్యార్ధుల సంఖ్య ఏటికేడాది తగ్గుతూ వస్తున్నది. దీనిని పరిశీలిస్తే జనాభా నియంత్రణ వ్యవహారం తెలుస్తోంది. 1వ తరగతిలో 2006-07 విద్యాసంవత్సరంలో విద్యార్థుల నమోదు111.97 శాతం కాగా.. 2015-16 నాటికి అది 102.48 శాతానికి తగ్గింది. పదుండ్లలో 9.49 శాతం తగ్గుదల నమోదైంది. కుటుంబ నియంత్రణ పద్ధతుల వాడకం పెరిగి జననాల రెటు తగ్గుతున్న క్రమంలో ఆ ప్రభావం పాఠశాలల్లో  విద్యార్థుల నమోదుపై కనపడుతున్నది.
భవిష్యత్తులోనూ దీని ప్రభావం మరింత అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయని తాజా గణాంకాలనుబట్టి  అర్థమవుతుంది. 2009-10 నుంచి 2012-13 సంవత్సరాల మధ్య కాలంలో విద్యార్థుల నమోదు ఒకింత
నెరిగినా మొత్తంగా చూసుకుంటే తగ్గుతూనే వస్తుందన్న విషయాన్నివిద్యాశాఖ వెల్లడించిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. చదువుకునే వయసున్న పిల్లలు, పాఠశాలలో చేరిన పిల్లల నిష్పత్తి ఆధారంగా ఈ శాతాన్ని లెక్కిస్తారు. పదో తరగతికి వచ్చేసరికి దాదాపు 30 శాతం వరకు విద్యార్థులు మద్యలో బడి మానేస్తున్నాఆరని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పాఠశాల చదువును మధ్యలోనే వదిలివేసే విద్యార్థుల సంఖ్య (డ్రాపవుట్స్‌) విషయంలో మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి. పదేండ్ల క్రితం డ్రాపవుట్లు 63.27 శాతం ఉండగా 2015-16 నాటికిఅవి 26.28  శాతానికి పడిపోయాయి. పదేండల్లో డ్రాపవుట్లు 36.99  శాతం తగ్గాయి.

తాజావార్తలు