పాత ఎమ్మెల్యే క్వార్టర్స్‌ ముట్టడికి ఏఐఎస్‌ఎఫ్‌ యత్నం

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర కోరుతూ పాత ఎమ్మెల్యే క్వార్టర్స్‌ ముట్టడికి ఏఐఎస్‌ఎఫ్‌ కార్యకర్తలు యత్నించారు. ఈ ఉదయం పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్న కార్యకర్తలు తెలంగాణకు అనుకూల నినాదాలు చేశారు. ప్రజాప్రతినిధులు తెలంగాణ కోసం రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. భారీగా మోహరించిన పోలీసులు పలువురు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.