పాదయాత్రకు ముందే తెదేపా లేఖ ఇవ్వాలి:పొన్నం ప్రభాకర్‌

హైదరాబాద్‌: తెదేపా అధినేత చంద్రబాబు తన పాద యాత్రకు ముందే తెలంగాణపై కేంద్రానికి లేఖ ఇవ్వాలని లేఖ ఇవ్వాలని కాంగ్రెస్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ డిమాండ్‌ వ్యక్తం చేశారు. తెలంగాణ కవాతుకు ముందే సీఎం, తెలంగాణ మంత్రులు ప్రత్యేక రాష్ట్ర ప్రాధాన్యతను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. జీవ వైవిధ్య సదస్సు జరగనున్న  నేపథ్యంలో హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ దెబ్బ తీసే ఆలోచన తెలంగాణవాదులకు లేదని తెలియజేశారు.