పాదయాత్రపై సుదీర్ఘ చర్చలు

హైదరాబాద్‌: అక్రమాస్తుల కుసులో చంచల్‌గూడ జైలులో ఉన్న వైఎస్‌ జగన్‌ను ఆయన తల్లి వైఎస్‌ విజయమ్మ, భార్య భారతి కలసి సుదీర్ఘంగా చర్చలు జరిపారు. పార్టీ ఆధ్వర్యంలో చేపట్టనున్న పాదయాత్రపై నిర్ణయం తీసుకునే విషయంలో జగన్‌తో చర్చించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా వారితో పాటు మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కుమారుడు జలగం వెంకట్రావు కూడా జగన్‌ను కలిశారు.