పాపసానిపల్లెలో సూకీ : పథకాల పరిశీలన

అనంతపురం : మయన్మార్‌ ప్రతిపక్ష నాయకురాలు, నోబుల్‌ బహుమతి గ్రహీత ఆంగ్‌ సాన్‌ సూకీ శనివారం రాష్ట్రంలోని  అనంతపురం .ఇల్లాలో పర్యటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి  కిరణ్‌కుమార్‌ ఆమెకు స్వాగతం పలికారు. కేంద్ర మంత్రి జైరాం రమేష్‌తో ఇక్కడికి  వచ్చిన సూకీ జిల్లాలోని మడకశిర మండలం గోవిందాపురం గ్రామంలో ఉపాధి హామి  పనులను పరిశీలించి ఇందుకు సంబంధించి పవర్‌ పాయింట్‌ ప్రదర్శనను తిలకించారు. ఉపాధి హామీ కూలీలతో ముచ్చటించిన సూకీ అక్కడ  మామిడి మొక్కల సాగును కూడా పరిశిలీంచారు. పంట వివరాలను అడిగి తులుసుకున్నారు.తన పర్యటనలో భాగంగా ఆమె జిల్లాలోని పాపసాని పల్లెకు వెళ్ళి కరపు పరిస్థితుల్లో ప్రభుత్వ పథకాల ద్వారా ఆర్ధికంగా ప్రభావితమైన ప్రజల జీవనశైలిని గమనించారు. ఈ క్రమంలో స్వయం సేవా బృందానికి చెందిన ముద్దక్క అనే మహిళ కుటుంబంతో సమావేశమయ్యారు. అక్కడి జెడ్‌పిపిహెచ్‌ఎస్‌ పాఠశాలలో స్వయం సేవా బృందాల మహిళలతో సూకీ సమావేశానికి ఏర్పాట్టు చేశారు. ఈ పర్యటనలో పాల్గోన్నా రాష్ట్ర రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి సూకీ ప్రసంగాన్ని స్థానికుల కోసం అనువదించారు.సూకీ పర్యటన కోసం ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. 10 మంది డీఎస్పీలు.29 మంది సిఐలు, 91 మంది ఎస్సైలు, 182 మంది హెడ్‌ కానిస్టేబుళ్ళు, 600 మంది పోలీస్‌ కానిస్టేబుళ్ళు, 250 మంది హోంగార్డ్‌లు, 200 మంది స్పెషల్‌ పార్టీ సిబ్బంది, 50 మంది మహిళా కానిస్టేబుళ్ళును ప్రభుత్వం మొహరించింది.