పార్టీనేతలతో ముగిసిన ఆజాద్‌ భేటీ

హైదరాబాద్‌: గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ పార్టీనేతలతో రాష్ట్రవ్యవహారాల ఇంఛార్జీ గులాం సబీ ఆజాద్‌ నిర్వహించిన సమావేశం ముగిసింది. గత కొద్దికాలంగా నామినేటెడ్‌ పదవులను భర్తీ చేయడం లేదని ఆజాద్‌తో కాంగ్రెస్‌ నతేలు మొరపెట్టుకున్నారు. కాంగ్రెస్‌ నేతల్లో నిరాశ అలుముకుంటోందని, ఇప్పటికైనా నామినేటెడ్‌ పదవులను భర్తీ చేయాలని ఆజాద్‌ను నేతలు కోరారు. అయితే నేతల సూచనలకు అనుగుణంగా స్పందించారు. సీఎం కిరణ్‌తో చర్చింది త్వరలో నామినేటెడ్‌ పదవులను భర్తీ చేస్తామని ఆజాద్‌ హామీ ఇచ్చారు.