పార్టీ ఇచ్చిన లేఖకే కట్టుబడి ఉన్నాం : యనమల
రాజమండ్రి : తెలంగాణ అంశంపై అఖిలపక్షంలో పార్టీ ఇచ్చిన లేఖకే కట్టుబడి ఉన్నామని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తెలిపారు. పలువురు సీమాంధ్ర తెదేపా నేతలు తెలంగాణ అంశంపై వ్యాఖ్యలు చేస్తుండటంతో యనమల స్పందించారు. వ్యక్తులు చెప్పే అభిప్రాయానికి, పార్టీ అభిప్రాయానికి సంబంధం లేదని ఆయన తూర్పుగోదావరి జిల్లాలో వెల్లడించారు.