పార్లమెంట్‌ ఆవరణలో విపక్షాల ధర్నా

న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంపై పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల చివరి రోజున పార్లమెంట్‌ ఆవరణలో విపక్షాలు ధర్నాకు దిగాయి. భాజపా నేతలు అద్వానీ, సుష్మాస్వరాజ్‌ తదితరులు ఈ ధార్నలో పాల్గొన్నారు. నైతిక బాధ్యత వహించి ప్రధాని రాజీనామా చేయాలని నేతలు డిమాండ్‌ వ్యక్తం చేశారు.