పింకీకి బెయిల్‌

కోల్‌కతా : అత్యాచార అరోపణలు ఎదుర్కొంటున్న క్రీడాకారిణీ పింకీ ప్రామాణిక్‌కు ఉత్తర 24 పరగణాస్‌ జిల్లా న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది. పింకీ మహిళ కాదని తనపై అత్యాచారం చేసినట్టు ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు పింకీని అదుపులోకి తీసుకున్నారు. న్యాయస్థాన ఆదేశాల మేరకు పింకీకి ప్రభుత్వ వైద్యులు లింగ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. 25 రోజుల కస్టడీ అనంతరం పింకీకి బెయిల్‌ మంజూరు కావడంతో బెంగాల్‌ రాష్ట్ర క్రీడావర్గాలు హర్షం వ్యక్తం చేశాయి.