పించనుదారుల రాష్ట్ర సదస్సు వాయిదా

భద్రాచలం : అల్‌ పెన్షనర్స్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషస్‌ అధ్వర్యంలో కోత్తగూడెంలో ఈ నెల 7న జరగాల్సిన రాష్ట్ర స్థాయి సదస్సు వాయిదా చేసింది. ఈ మేరకు అ సంఘం డివిజన్‌ కో కన్వీనర్‌ బందు వెంకటేశ్వరావు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సదస్సు ఈ నెల 18 న జరుగుతుందన్నారు బోగ్గుగని కార్మికులకు సరైన న్యాయం జరగడంలేదని అందోళన వ్యక్తం చేశారు. పించను పథకాల్లో అంతులేని అలసత్వం కనిపిస్తుందన్నారు. వీఅర్‌ఎన్‌ ద్వారా రిటైర్డ్‌ అయిన కార్మికులకు వైద్య సౌకర్యాలు కల్పించక పోవడం దారుణమన్నారు.