పీ.ఏ.పల్లి మండలం ఎం.పీ.డీ.వో ఆఫీస్ లో సాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఘన నివాళులు

share on facebook

పెద్దఅడిషర్లపల్లి సెప్టెంబర్26(జనంసాక్షి):తెలంగాణ సాయుధ పోరాట వీర వనిత సంపండవర్గాల ఆత్మగౌరవ ప్రతీక,బహుజన బిడ్డ,భూమికోసం,భుక్తి కోసం,వెట్టిచాకిరి విముక్తికోసం,తెగువను, పోరాటస్ఫూర్తిని ప్రపంచానికి చాటిన మన తెలంగాణ వీరవనిత సాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా నేడు పీ.ఏ.పల్లి మండలం ఎంపీడీవో ఆఫీసులో మండల ఎంపీపీ వంగాల ప్రతాప్ రెడ్డి ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీవో,మండల పిఎసిఎస్ చైర్మన్ & టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు గౌరవ యెల్గూరి వల్లపురెడ్డి,వైస్ ఎంపీపీ అరవపల్లి సరిత నరసింహ,స్థానిక సర్పంచ్ గొర్ల సైదమ్మ శ్రీనివాస్, దేవరకొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులు యర్ర యాదగిరి, అమరేందర్, ఆఫీస్ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు..

Other News

Comments are closed.