*పెట్రోల్, డిజిల్ ధరలను GST పరిధిలో చేర్చాలి*

*నిత్యావసరాల ధరలు తగ్గించాలి*.
రామన్నపేట సెప్టెంబర్ 11 (జనంసాక్షి) పెట్రోల్ డీజిల్ ధరను జిఎస్టి పరిధిలో చేర్చి, నిత్యవసర ధరలు తగ్గించాలని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్  ఫెడరేషన్ కేంద్ర కమిటి సభ్యులు,జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆదివారం మండల కేంద్రంలోని రామన్నపేట  మండల రోడ్ ట్రాన్స్ పోర్ట్ డ్రైవర్స్ & వర్కర్స్ యూనియన్  మొదటి మహాసభ జిల్లా ఉపాధ్యక్షుడు గుండాల బిక్షం అద్యక్షతన జరిగినది.ఈ మహాసభకు ముఖ్య అతిథిగా  కల్లూరి మల్లేశం హాజరై మాట్లాడుతూ ప్రతి వస్తువుపైన జీఎస్టీ వేస్తున్న కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డిజిల్ పైన ఎందుకు జీఎస్టీ వేయడం లేదని ప్రశ్నించారు. జీఎస్టీ వేయడం వలన లిటర్ పెట్రోల్ 60 రూపాయలకే వస్తుందని తెలియజేశారు.రావాణ రంగం కార్మికులకే కాకుండా యావత్ దేశ ప్రజలకు నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయని తెలియజేశారు.
ట్రాన్స్ పోర్ట్ కార్మికుల కు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని,నూతన మోటారు వాహన సవరణ చట్టం-2019 ని రద్దు చేయాలని,యాదగిరిగుట్ట పైకి అటోలకు అనుమతించాలని,ప్రతి మండల కేంద్రం లో అటో అడ్డాల కు స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ మహాసభలో AIRTWF జిల్లా అద్యక్షులు యండి పాషా,CITU మండల కన్వీనర్ మామిడి వెంకట్ రెడ్డి ,భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అద్యక్షులు గొరిగే సోములు,రోడ్ ట్రాన్స్ పోర్ట్ డ్రైవర్స్ & వర్కర్స్ యూనియన్ నాయకులు తిరుపాల బిక్షపతి, బాలగోని గణేష్, శంకర్, గొరిగే కృష్ణ,గోపాల్ రెడ్డి, యండి నజిర్,ఏర్రోళ్ళ వంశీ,మిర్యాల మల్లేష్,తిరుపాల ఐలయ్య,ముషం నరహరి, వీరేశం, బండ లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.
Attachments area