పెద్దమ్మ గుడిలో రేవంత్ ప్రత్యేక పూజలు
అమ్మ ఆశీర్వాదం తీసుకుని సమాలోచనలు
హైదరాబాద్,అక్టోబర్30((జనంసాక్షి): తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా అనంతరం తొలిసారిగా తన నివాసంలో అభిమానులు, అనుచరులు, పార్టీ కార్యకర్తలతో సమావేశం కావడంతో ఆచన ఇంటి వద్ద కోలాహలం నెలకొంది. ఉదయం 10గంటలకు జూబ్లిహిల్స్ పెద్దమ్మగుడిలో పూజలు నిర్వహించిన అనంతరం ఆత్మీయ సమావేశం ప్రారంభించారు. గుడికి వెల్ళిన ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల అభిమానులు, ప్రభుత్వ వ్యతిరేక నాయకులతో సమావేశమై రేవంత్ చర్చించనున్నారు. అనంతరం తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు.మరోవైపు.. ఆత్మీయ సమావేశానికి పలు జిల్లాల ముఖ్యనేతలు, జిల్లా అధ్యక్షులు హాజరవుతున్నారు. ఇవన్నీ అటుంచితే వరంగల్ జిల్లా టిఆర్‌ఎస్ నేత దొమ్మటి సాంబయ్య ఆత్మీయ సమావేశానికి హాజరుకావడం గమనార్హం. అయితే ఈయన రేవంత్‌తో పాటు కాంగ్రెస్ చేరతారా? లేక ఆయనతో ఉన్న సాన్నిహిత్యంతో సమావేశానికి హాజరయ్యారా అనే విషయం తెలియాల్సి ఉంది. మొత్తానికి సాంబయ్య సమావేశానికి హాజరుకావడం చర్చనీయాంశమైంది. కాగా ఇప్పుడిప్పుడే రేవంత్ ఇంటికి భారీగా అభిమానులు, కార్యకర్తలు, అనుచరులు, ముఖ్యనేతలు చేరుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. రేవంత్‌తో పాటు మరికొందరు నేతలు పార్టీ మారతారనే వార్తలు వస్తున్నాయి. దీంతో రంగంలోకి దిగిన ఇంటెలిజెన్స్ అధికారులు జూబ్లిహిల్స్‌లోని రేవంత్ ఇంటి పరిసరాల్లో భారీగా మోహరించారు. ఎవరెవరు రేవంత్‌ను కలుస్తున్నారు..? ఎవరెవరు సమావేశానికి హాజరవుతున్నారనే విషయాలను నిశితంగా పరిశీలిస్తున్నారు.



