పేదరికం, అసమానత్వాలను నిర్మూలించాలి: జస్టిస్‌ మార్కేండేయ కట్జూ

హైదరాబాద్‌: పేదరికం, అసమానత్వాలను నిర్మూలించినట్టయితే ఉగ్రవాదాన్ని నిర్మూలించలేమని ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా చైర్మెన్‌ జస్టిస్‌ మార్కేండేయ కట్జూ అభిప్రాయపడ్డారు. అఖండ భారతావనిని మతాల చిచ్చు పెట్టి బ్రిటిషర్లు చీల్చారని, పాకిస్థాన్‌ అనే దొంగ దేశాన్ని ఏర్పాటు చేశారన్నారు. ఇవాళ సాలార్‌ జింగ్‌ మ్యూజియంలో ‘ఉగ్రవాద వార్తలను అందివ్వడంలో – మీడియా పాత్ర’ అనే అంశం పై ఏర్పాటైన సదస్సులో ఆయన మాట్లాడారు. హిందూ పత్రిక, హెల్ప్‌ హైదరాబాద్‌ అనే స్వచ్ఛంద సంస్ధలు ఏర్పాటు చేసిన ఈ సదస్సులో వివిధ అంశాలపై అడిగిన సందేహాలు కట్జూ సమాధానాలిచ్చారు. మరో 25 సంవత్సరాల్లో పోరుగు దేశాలైన భారత్‌, పాక్‌,బంగ్లాదేశ్‌ ఏకమవుతాయని అన్నారు. మత రాజ్యంగా ప్రకటించుకున్న పాకిస్థాన్‌ తరచు బాంబుదాడులు, పేలుళ్ల ఘటనలతో అక్కడి ప్రజలకు శాంతి, భద్రతలు లేకుడా జీవిస్తున్నారు. సైబరాబాద్‌ కమిషనర్‌ ద్వారక తిరుమలరావు మాట్లడుతూ ఉగ్రవాదులు తమ దాడులతో ప్రపంచాన్ని చిన్నా భిన్నం చేయాలను కుంటే మీడియా తన ప్రచారం ద్వారా వారి లక్ష్య సాధనకు తోడ్పడుతుందరాన్నారు. కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ హరగోపాల్‌, నల్సార్‌ విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్‌ ఫైజాస్‌ ముస్తఫా, ప్రొఫెసర్‌ సిద్దార్థలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తాజావార్తలు