పొగమంచు కారణంగా విమాన రాకపోకలకు అంతరాయం

న్యూఢిల్లీ : పొగమంచు కారణంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉదయం 7 గంటల నుంచి రన్‌వేపై దట్టమైన పొగమంచు పేరుకుపోవడంతో సుమారు 20 విమాన సర్వీసుల రాకపోకలు ఆలస్యమవగా రెండింటిని రద్దు చేశారు. 9 గంటల అనంతరం పరిస్థితి క్రమంగా మెరుగుపడుతున్నట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు.