పొన్నం వ్యాఖ్యలు అపోహ మాత్రమే
హైదరాబాద్: తెలంగాణ మంత్రులను ముఖ్యమంత్రి అగౌరవ పరుస్తున్నారన్న ఎంపీ పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలపై మంత్రులు శ్రీధర్‌బాబు, సునీతాలక్ష్మారెడ్డి స్పందించారు. తమను సీఎం ఎప్పుడూ అగౌరవపరచలేదని, అది కేవలం అపోహ మాత్రమేనని వారు తెలిపారు. పూర్తి స్వేచ్ఛ, సహకారం ఇస్తూ తెలంగాణ ప్రాంత అభివృద్ధికి ముఖ్యమంత్రి కృషిచేస్తున్నారని మంత్రులు చెప్పారు. తెలంగాణ ప్రాంతంలో అతి పెద్ద ప్రాజెక్టైన ప్రణహిత-చేవెళ్ల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారని మంత్రులు గుర్తుచేశారు.



